-- --

బోధన్ అభివృద్ధి ఎక్కడ? రైతుల కష్టాలు కనిపించడం లేదా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రజలే నిర్ణయించాలి.. రైతులు, కార్యకర్తల మనస్సాక్షికే వదిలేస్తున్నా: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్

బోధన్, నవంబర్ 29:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయడాన్ని గుర్తుచేస్తూ దీక్షా దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.

అనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. బోధన్‌లో అభివృద్ధి ఎక్కడ జరిగింది? ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధి ఏమిటి? పట్టణాన్ని స్మశానంలా మార్చేశారంటూ మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

మండల ప్రజలు, రైతులు, పార్టీ కార్యకర్తలు ఇక మీరే నిర్ణయించండి.. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి అని మీడియా ముందు వ్యాఖ్యానించారు. బోధన్‌లో అభివృద్ధి జరిగిందా? రైతుల సమస్యలు పరిష్కారమయ్యాయా? పాలకుల పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? అనేది ప్రజలే తేల్చాలని అన్నారు. రైతులు, కార్యకర్తలు తమ మనస్సాక్షి ప్రకారం స్పందించి సమాధానం చెప్పాలని కోరారు.

– V1 న్యూస్ తెలంగాణ

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more