-- --

బీజేపీ బోధన్ పట్టణ నూతన కమిటీ ఏర్పాటు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా ఇన్‌ఛార్జి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడి నియామకం….

బోధన్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోధన్ పట్టణ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ సమక్షంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించారు.

ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ ఉపాధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్, కనిగంటి పనీంద్ర, కాంబ్లె చరణ్‌లను నియమించారు. పట్టణ కార్యదర్శులుగా పడాల శ్రీనివాస్, బండరుపల్లి కిరణ్, బాంపెల్లి వినయ్‌లకు బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా మహేందర్‌ను, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా కస్ప లింగంను నియమించారు.

ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎనుగంటి గౌతమ్, దళిత మోర్చా అధ్యక్షులు కలిగోట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more