-- --

వృద్ధురాలికి న్యాయం చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశాలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచన….

బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ప్రభుత్వ సలహాదారు – స్థలం రిజిస్ట్రేషన్ రద్దుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశం…

బోధన్ రూరల్, నవంబర్ 20: నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి అండగా నిలిచి, ఆమెకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి. వృద్ధురాలిని, దివ్యాంగురాలిని మోసం చేసి వారి ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోధన్ పట్టణ సీఐని ఆదేశించారు.

శుక్రవారం బోధన్ పట్టణానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని బాధితులు కలిసి తమ సమస్యను వివరించారు. బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన నాగమణి ఇంటి స్థలాన్ని స్థానిక వార్డు మెంబర్ ఒకరు సహాయం చేస్తానని నమ్మించి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆరు నెలల తర్వాత తమకు తెలిసిందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి స్థలాన్ని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

బాధితుల ఆవేదనను శ్రద్ధగా ఆలకించిన సుదర్శన్ రెడ్డి వారి సమస్యపై వెంటనే స్పందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎస్‌హెచ్‌ఓ వెంకట నారాయణను ఆదేశించారు. అదేవిధంగా, రిజిస్ట్రేషన్ రద్దుకు అవసరమైన చర్యలు చేపట్టి నాగమణికి ఆమె ఇంటి స్థలం తిరిగి దక్కేలా చూడాలని తహసీల్దార్ విఠల్‌కు సూచించారు.

బాధితుల సమస్యను స్వయంగా విని, పోలీసు మరియు రెవెన్యూ అధికారులను వెంటనే అప్రమత్తం చేసి న్యాయం జరిగేలా చర్యలకు ఆదేశించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more