-- --

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో 810 మందికి నూతన చేయూత పింఛన్లు.. 68 మందికి రూ. 2.68 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ…

ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు…

బోధన్, నవంబర్ 20: అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా పట్టణానికి చెందిన 810 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ పత్రాలను, 68 మందికి రూ. 2 కోట్ల 68 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాంలను అందించడంతో పాటు ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

అలాగే, ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ద్వారా కుటుంబానికి సంపాదన అందించే వ్యక్తికి ఏదైనా ఆపద సంభవిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం: మున్సిపల్ చైర్‌పర్సన్….

మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం సంతోషకరమని అన్నారు. పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ కాహేర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, పట్టణ అధ్యక్షులు దాము, నాయకులు శరత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మున్సిపల్ ఏఈ, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more