-- --

అనుమతులు లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రూ.50 వేల జరిమానా.. బోరుబండి సీజ్‌ – తహసీల్దార్ విఠల్ హెచ్చరిక…

 

బోధన్: మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొత్తగా బోరుబావుల తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో కిషోర్ హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా బోరుబావులు తవ్వే బోరుబండి యజమానులకు రూ.50 వేల జరిమానా విధించడంతో పాటు, సంబంధిత బోరుబండిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపట్ల ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.

ప్రస్తుతం భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. విచ్చలవిడిగా బోరుబావులు తవ్వడం వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడటమే కాకుండా, భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల బోరుబావుల తవ్వకాలకు ముందు తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని సూచించారు.

ఈ సందర్భంగా బోరుబండి యజమానులు ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ అధికారులకు సహకరించాలని, రైతులు, ప్రజలు కూడా అనుమతులు లేకుండా బోరుబావుల తవ్వకాలను ప్రోత్సహించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. భూగర్భ జలాలను భావితరాల కోసం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో కిషోర్ కోరారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more