-- --

ఆపదలో ఉన్న స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచిన ఆప్తమిత్రులు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

స్నేహితురాలి కుమార్తె వైద్య ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం – మానవత్వాన్ని చాటుకున్న 1998–99 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు…

సాలూర: స్నేహం అంటే కేవలం కలుసుకోవడం, మాట్లాడుకోవడమే కాదు.. ఆపద సమయంలో అండగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని కల్పించడమని నిరూపించారు 1998–1999 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు.

సాలూర క్యాంపునకు చెందిన తమ తోటి స్నేహితురాలు విజయలక్ష్మి కుమార్తె ఆరోగ్య అవసరాల నిమిత్తం శుక్రవారం (20-11-2026) జడ్పీహెచ్‌ఎస్ పెంటఖుర్దు పాఠశాలలో 1998–1999 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా కలిసి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి కుటుంబానికి స్నేహితులంతా మనోధైర్యాన్ని కల్పించారు. ఎలాంటి అవసరం వచ్చినా తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమె కుమార్తె త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఆపదలో ఉన్న స్నేహితురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు మానసికంగా అండగా నిలిచిన పూర్వ విద్యార్థుల ఔదార్యంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో స్నేహితులు ఎం. గోవింద్, కె. పోశెట్టి, అనిత, ఎస్. గంగాధర్ చారి, ఏ. కిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more