ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి…

సాలూర, నవంబర్ 20 (V1 న్యూస్ తెలంగాణ):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం సాలూర మండలంలోని సాలూర గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు. ఉదయం 9:30 గంటలకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు…
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించనున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం…
వివరాల ప్రకారం, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులకు ఈ పథకం వర్తించనుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం ఉపయోగకరంగా ఉండనుంది. కుటుంబానికి భద్రత కల్పించే ఈ బీమా పథకం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని, అర్హత ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సాలూర గ్రామ సర్పంచ్ సుఖం లావణ్య రవి, హుంసా సొసైటీ చైర్మన్ మందార రవి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఇలాంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని వదులుకోకుండా పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి సర్పంచ్ సుఖం లావణ్య రవి, హుంసా సొసైటీ చైర్మన్ మందార రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

ప్రజల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎల్తేపు శంకర్, సొసైటీ చైర్మన్ అల్లే రమేష్, మాజీ చైర్మన్ అల్లే జనార్ధన్, హుంసా సొసైటీ చైర్మన్ మందార రవి, సాలూర మండల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







