-- --

సొంత ఖర్చులతో గ్రీన్ మ్యాట్లు అందించిన దాత ఇల్తెపు శంకర్ సార్…. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 సొంత ఖర్చులతో గ్రీన్ మ్యాట్లు అందించిన దాత ఇల్తెపు శంకర్ సార్….

లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ…

సాలూరలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు 18 గ్రీన్ మ్యాట్ల పంపిణీ – లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి ఆధ్వర్యంలో వితరణ….

సాలూర: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు దాత ఇల్తెపు శంకర్ సార్ ముందుకొచ్చారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి, వారికి సహాయం అందిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంత ఖర్చులతో నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు 18 గ్రీన్ మ్యాట్లను అందించారు.

గత ఆగస్టు 15న సాలూర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఇల్తెపు శంకర్ సార్, ఆ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు నేలపై కూర్చొని ఉండడాన్ని గమనించారు. విద్యార్థులకు కూర్చోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ మ్యాట్లు అందజేస్తానని ఆ సందర్భంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో గ్రీన్ మ్యాట్లను కొనుగోలు చేసి పంపిణీకి అందించారు.

సాలూర గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల (ఉ/మీ), హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలకు ఈ గ్రీన్ మ్యాట్లను అందజేశారు. దాత ఇల్తెపు శంకర్ సార్ తన సొంత ఖర్చులతో అందించిన ఈ గ్రీన్ మ్యాట్లను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి ప్రతినిధులు దుర్గారావు, చక్రవర్తి మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఇల్తెపు శంకర్ సార్ మాట్లాడుతూ, విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాజీ మంజుష, సాలూర గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి, పీఏసీఎస్ చైర్మన్ అల్లె రమేష్, పీఆర్టీయూ మండల అధ్యక్షులు కల్లూరి శంకర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంటె లక్ష్మణ్, గ్రామ పెద్దలు సొక్కం రవి, కేజీ గంగారం, మందార్న రవి, వాహెద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more