పెంటాఖుర్దు శివారులో కోళ్ల పందేల స్థావరంపై దాడి.. 10 కోళ్లు, 8 మంది పందెం రాయుళ్లు అదుపులో….
🚨 కోళ్ల పందేలపై పోలీసుల ఉక్కుపాదం
పెంటాఖుర్దు శివారులో దాడి — 10 కోళ్లు, 8 మంది అదుపులో
బోధన్, అక్టోబర్ 6: బోధన్ మండలంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న కోళ్ల పందేలపై బోధన్ రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం మండలంలోని పెంటాఖుర్దు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కోళ్ల పందేల స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
బోధన్ రూరల్ ఠాణా ఎస్హెచ్ఓ ఎం. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెంటాఖుర్దు గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన పలువురు పందెం రాయుళ్లు అక్కడి నుంచి పరుగులు తీసేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులు 10 కోళ్లను, 8 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మండలంలో ఎక్కడైనా అక్రమంగా కోళ్ల పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








