వాట్సాప్ స్టేటస్ ద్వారా స్పందించి రూ.45,400 ఆర్థిక సహాయం
వర్ని, అక్టోబర్ 5: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన తిప్పారం ఆనంద్ గౌడ్ కవల పిల్లలు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం అవసరమైన పరిస్థితి నెలకొంది.
కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సమాజ సేవకుడు సీతలే రమేష్ మానవతా దృక్పథంతో స్పందించారు. జలాల్పూర్ గ్రామానికి చెందిన ఆయన స్నేహితులు విషయం తెలియజేయడంతో వెంటనే స్పందించిన సీతలే రమేష్, తన వాట్సాప్ స్టేటస్ ద్వారా సహాయం చేయాలని కోరుతూ సందేశాన్ని ప్రచారం చేశారు. దీనికి స్పందించిన దాతల నుంచి నిధులు సేకరించి మొత్తం రూ.45,400 సమకూర్చారు.
అనంతరం జలాల్పూర్ గ్రామానికి వెళ్లి కవల పిల్లల కుటుంబ సభ్యులకు రూ.45,400 నగదును అందజేశారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు సీతలే రమేష్‌ను అభినందించారు.

ఈ సేవా కార్యక్రమంలో సమాజ సేవకుడు సీతలే రమేష్, బుర్ఖా శంకర్ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు.
కవల పిల్లల చికిత్సకు మరింత ఆర్థిక సహాయం అవసరమని, దాతలు తమకు తోచిన విధంగా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్థులు కోరారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








