-- --

పోలీసులమంటూ నమ్మించి మహిళ మెడలోని బంగారం దోపిడీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రెండున్నర తులాల గొలుసు, ఆరు తులాల గాజులు అపహరణ – బోధన్‌లో కలకలం

బోధన్, అక్టోబర్ 6:
పోలీసులమంటూ ఓ మహిళను నమ్మించి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లిన ఘటన సోమవారం బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది.

వివరాల ప్రకారం.. బోధన్ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో ఓ దాబా సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళ వాహనాన్ని అడ్డగించారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుని, బైపాస్ రోడ్డులో దొంగలు దారి దోపిడీలకు పాల్పడుతున్నారని, బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించడం సురక్షితం కాదని ఆమెను నమ్మించారు.

అనంతరం మహిళ మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసు, చేతికి ఉన్న ఆరు తులాల బంగారు గాజులను తీసి పర్సులో పెట్టాలని సూచించారు. ఆభరణాలను పర్సులో పెట్టి కవర్‌లో ఇస్తామని నమ్మించి, బాధితురాలి వద్ద నుంచి వాటిని తీసుకున్నారు. అయితే అనంతరం ఆమెకు ఖాళీ కవర్‌ను అందించి అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు.

కొద్దిసేపటి తర్వాత బాధితురాలు తిరుపతమ్మ ఆసుపత్రికి చేరుకుని తన వద్ద ఉన్న పర్సును పరిశీలించగా, పర్సుతో పాటు అందులోని బంగారు ఆభరణాలు, రూ.2,000 నగదు కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆమె తీవ్ర ఆందోళనకు గురై ఆసుపత్రి వద్దే కుప్పకూలిపోయింది.

వెంటనే బాధితురాలు బోధన్ పట్టణ పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసి, నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more