-- --

తెలంగాణలో అయ్యప్పచిన్ముద్ర సేవా ట్రస్ట్‌కు నూతన కార్యవర్గం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అయ్యప్పచిన్ముద్ర సేవా ట్రస్ట్ తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక

శామీర్‌పేట్, అక్టోబర్ 4: అఖిల భారత అయ్యప్పచిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం శామీర్‌పేట్–ఆలియాబాద్‌లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి గురుస్వాములు, ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణలోని సుమారు 12 జిల్లాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కన్వీనర్‌గా వెంకటేష్ గురుస్వామి (చింతల్), గౌరవ అధ్యక్షులుగా వేణుగోపాలరావు గురుస్వామి (జీడిమెట్ల), అధ్యక్షులుగా బొబ్బర్ల సురేష్ స్వామి (మేడ్చల్) ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా బుర్ల శ్రీనివాస్ (భద్రాద్రి కొత్తగూడెం), ఆకుల వెంకటేష్ (మేడ్చల్), కంచోజు సత్యనారాయణ (నిజామాబాద్), మంత నరేంద్ర చారి (సిద్దిపేట్), ప్రధాన కార్యదర్శిగా గుత్త చంద్రశేఖర్ గురుస్వామి (ఖమ్మం), కోశాధికారిగా పృథ్వి స్వామి (హైదరాబాద్) ఎంపికయ్యారు.

సహాయ కార్యదర్శులుగా అమరేంద్ర చారి (సంగారెడ్డి), వెల్ది నాగరాజు (వరంగల్), ప్రాంతీయ కార్యదర్శులుగా నరసింహారావు (ములుగు), పల్లె నిఖిల్ (నిజామాబాద్), నాల్ల నరసింహారావు (మహబూబాబాద్), మణిపుత్ర మహేష్, వాలంటరీ కమాండెంట్‌గా పోతురాజుల వెంకట్రావు (భద్రాద్రి కొత్తగూడెం), PROగా శేఖర్ స్వామి (భద్రాద్రి కొత్తగూడెం) నియమితులయ్యారు.

శబరిమల మహా అన్నదానంపై చర్చ

సమావేశంలో శబరిమలలో కొనసాగుతున్న మహా అన్నదాన కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. అయ్యప్ప భక్తులకు నిరంతర సేవలు అందించేలా అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడంతో పాటు, భవిష్యత్‌లో సేవా, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు.

నూతన కార్యవర్గ సభ్యులు ట్రస్ట్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను మరింత ఐక్యం చేసి సేవా కార్యక్రమాలను బలోపేతం చేయాలని సమావేశంలో ప్రతినిధులు ఆకాంక్షించారు. గురుస్వాముల మార్గదర్శకత్వంలో భక్తుల ఐక్యత, ధర్మం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించారు.

ముఖ్య అతిథులు

సమావేశానికి ముఖ్య అతిథులుగా రుద్ర కోటేశ్వరరావు, పైలా ఆది మోహన్ రెడ్డి, కర్క సిద్దు, బ్యాల ఈశ్వరయ్య, అనంతరావు, బాలు లెంకల, వైకుంఠరావు, పిట్ట శ్రీహరి, చంటి గురుస్వామి, వాక చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. చిన్ముద్ర కుటుంబ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురుస్వాములు, ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more