-- --

రాకాసిపేటలో పోషణ మాస కార్యక్రమం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అంగన్వాడీ సేవలు, పోషకాహారంపై తల్లులకు అవగాహన

బోధన్, సెప్టెంబర్ 30: పోషణ మాస కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట సెక్టార్ స్థాయిలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బోధన్ సీడీపీఓ నందిని మాట్లాడుతూ “హమారీ అంగన్వాడీ.. హమారీ జిమ్మేదారీ” అనే నినాదంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించారు.

గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నారులకు అందించాల్సిన పోషకాహారం, ఆకుకూరలు మరియు పౌష్టికాహార ప్రాధాన్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. పోషకాహారం లోపించడం వల్ల రక్తహీనత, తక్కువ బరువు తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఈసీసీఈ డే (ECCE Day), తల్లులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ సీడీపీఓ నందిని, 11వ వార్డు కౌన్సిలర్ రేణుక, రాకాసిపేట ఐసీడీఎస్ సెక్టార్ సూపర్‌వైజర్ సరోజిని, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆసియా బేగం, ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ కోఆర్డినేటర్ నరేష్, జూనియర్ అసిస్టెంట్ అర్జున్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more