-- --

పెండింగ్‌లో ఉన్న రైతు రుణాలు తక్షణమే మాఫీ చేయాలి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పెంటాఖుర్ద్ పీఏసీఎస్‌ మహాజన సభలో తీర్మానం…

బోధన్, సెప్టెంబర్ 30 (ఆర్.కే. న్యూస్): పెండింగ్‌లో ఉన్న రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని పెంటాఖుర్ద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) వార్షిక మహాజన సభలో తీర్మానం చేశారు. సంఘం ఆవరణలో నిర్వహించిన ఈ మహాజన సభకు సంఘం చైర్మన్ అమర్నాథ్ బాబు అధ్యక్షత వహించారు.

సభలో సంఘం సీఈఓ రావుఫ్ వార్షిక జమా ఖర్చుల వివరాలను సంఘ సభ్యులు, రైతుల సమక్షంలో చదివి వినిపించారు. అనంతరం సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంఘ అభివృద్ధి తదితర అంశాలపై సభ్యులు చర్చించారు….

ఈ సందర్భంగా చైర్మన్ అమర్నాథ్ బాబు మాట్లాడుతూ.. రైతుల సహకారంతోనే సంఘం అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. సభ్యులు, రైతుల సమిష్టి కృషి ఫలితంగానే సంఘం సుభిక్షంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

మహాజన సభలో సంఘం వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more