-- --

హెల్మెట్ ధరిస్తేనే సురక్షిత ప్రయాణం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం..

బోధన్, ఆగస్టు 20: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాసు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఏసీపీలు శ్రీనివాసు, మస్తాన్ అలీతో పాటు బోధన్ టౌన్ SHO వెంకటనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించేందుకు మాత్రమే కాకుండా, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే కీలక రక్షణ కవచమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ప్రయాణంలో నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు వేగం కంటే ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

18 సంవత్సరాలు నిండని మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని అధికారులు సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లల భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. “హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ DGM సురేష్, DM నగేష్, AM సౌందర్యతో పాటు ఉద్యోగులు రాఘ, మహేందర్, సురేఖ, నర్మద, సతీష్, శ్రీకాంత్, దివ్య, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు రవీందర్ యాదవ్, దిలీప్ పటేల్, పద్మాకర్, సింగెడే పాండు, స్వప్న, విజేతతో పాటు ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు కలిసి వాహనదారులకు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, మైనర్లకు వాహనాలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

“హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. మైనర్లకు వాహనాలు ఇవ్వకండి.. వారి భవిష్యత్తును కాపాడండి” అని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more