-- --

చేతలు చేసే నాయకుడికి ప్రజల మద్దతు… మాటలు చెప్పే నాయకుడికి కాదు!”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రైతుల ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు: కోటగిరి మండల సర్పంచ్ మధు..

కోటగిరి, జూలై 16:

బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, విమర్శలు చేసినంత మాత్రాన రైతులకు నీరు రాదని, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషి ఫలితంగానే సాగునీరు అందుతుందని కోటగిరి మండల సర్పంచ్ మధు అన్నారు.

కోటగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీటి విడుదల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, వాస్తవాలను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని చెప్పారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన సేవాభావాన్ని విస్మరించి విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.

రాజకీయ ఆరోపణల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ప్రజల కోసం కలిసి పనిచేయడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more