-- --

“మాటలతో కాదు… చేతలతోనే నాయకత్వానికి ప్రజల తీర్పు”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శలకు మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ కౌంటర్

కోటగిరి, జూలై 16:

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గత పదేళ్ల పాలనలో బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టం మనోహర్ డిమాండ్ చేశారు.

కోటగిరి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలులోనూ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలోనూ పూర్తిగా విఫలమైన నాయకులు ఇప్పుడు “మహా ధర్నా” పేరుతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందిస్తూ, రైతులు, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరులో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు రేషన్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేసిందని పేర్కొన్నారు.

రైతుల పక్షాన నిలిచే నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడని కొట్టం మనోహర్ కొనియాడారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు.

ప్రజలకు సేవ చేయకుండా విమర్శలకే పరిమితమవుతున్న నాయకులను ప్రజలు గమనిస్తున్నారని, అసత్య ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు నమ్మబోరని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more