“ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది.. జాబితాలో పేరు ఉంటేనే మీ ఓటుకు విలువ!”
వి.1 న్యూస్, హైదరాబాద్, జూలై 15:
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం (CEC) గడువును పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం, బూత్ లెవల్ అధికారులు (BLOలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు ఆగస్టు 3 వరకు గడువు పొడిగించారు. అనంతరం ఆగస్టు 10న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

డ్రాఫ్ట్ జాబితాపై సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అక్టోబర్ 8 నాటికి పరిష్కరించగా, అక్టోబర్ 12న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ మేరకు సవరించిన షెడ్యూల్ను రాష్ట్రంలోని సంబంధిత ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీలకు వెంటనే తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
సవరించిన SIR షెడ్యూల్:
- ఆగస్టు 3: ఇంటింటి సర్వే ముగింపు
- ఆగస్టు 10: డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల
- సెప్టెంబర్ 9: క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ
- అక్టోబర్ 8: అభ్యంతరాల పరిష్కారం
- అక్టోబర్ 12: తుది ఓటరు జాబితా ప్రచురణ
**“మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







