కోటగిరి, జూలై 15 (వి.1 న్యూస్):
బాన్సువాడ నియోజకవర్గ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపారు.

గత మూడు దశాబ్దాలుగా రైతు సమస్యలపై అవగాహనతో పనిచేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ రంగంపై పూర్తి పట్టు కలిగిన నాయకుడని ఆయన కొనియాడారు. నిజాంసాగర్ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని అధికారులతో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, ఆగస్టు 1 నుంచి నిజాంసాగర్ కాలువ నీటి విడుదలకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నీటిని దఫాల వారీగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
ప్రతిపక్షాల విమర్శలను రైతులు నమ్మవద్దని, రాజకీయాల కంటే రైతుల సంక్షేమమే ముఖ్యమని నాయకులు స్పష్టం చేశారు. వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరగాలని ఆకాంక్షిస్తూ, రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ, బాన్సువాడ నియోజకవర్గ రైతుల కష్టసుఖాలు పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాగా తెలుసని, సాగునీటి నిర్వహణపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నారోజి గంగారం రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, కోటగిరి ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, పత్తి రాము, ఎగడోలి శంకర్, మాజీ ఎంపీపీ పవన్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్, మాజీ సర్పంచ్‌లు కత్తి లక్ష్మణ్, వర్ణి శంకర్, మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్, వైస్ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గంగాధర్ పటేల్తో పాటు రుద్రూర్, వర్ని, చందూర్, కోటగిరి మండలాల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
“రైతు నవ్వితేనే రాజ్యం నవ్వుతుంది… మాటలకంటే చేతలే నాయకుడి నిజమైన కొలమానం!”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







