“కంటికి వెలుగు ఉంటేనే జీవితానికి వెలుగు.”
వి.1 న్యూస్, పోతంగల్ | జూలై 15:
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం చైతన్ నగర్ గ్రామంలో గ్రామీణ ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించేందుకు పోతంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ కాంత సునీల్ సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో గ్రామానికి చెందిన వృద్ధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య నిపుణులు ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి తదుపరి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కాంత సునీల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోతంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పున్నే అర్జున్, ఉపాధ్యక్షుడు గంధపు దత్తు, ప్రధాన కార్యదర్శి వడ్ల సురేష్, కార్యదర్శి బ్యాగరి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శి ఎర్రోళ్ల యాదవరావు, కోశాధికారి సర్గు లక్ష్మణ్, గౌరవ సలహాదారులు నూత్పల్లి గణేష్, కనకమెడల శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ పాకాల గజేందర్, కార్యవర్గ సభ్యులు మొండే భీంరావు, రాజేష్, ముత్యాల శ్రీకాంత్, షేక్ అజారుద్దీన్, సద్దాం, శ్రీను, ఉపసర్పంచ్ యాదవ్ తదితరులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







