-- --

సీఎం భద్రతా విభాగంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో గన్‌మెన్ కిరణ్ మృతి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

హైదరాబాద్, జూలై 15 (వి1 న్యూస్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించిన కిరణ్ అకాల మరణం పోలీస్ శాఖతో పాటు ఆయన సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

2009 బ్యాచ్‌కు చెందిన కిరణ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరినప్పటి నుంచి వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా సేవలందించిన ఆయన, అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి భద్రతా బృందంలోనూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో గన్‌మెన్‌గా సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

సిద్దిపేట సమీప గ్రామానికి చెందిన కిరణ్, సిద్దిపేటలోని వైపీఆర్ (YPR) డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సేవాభావంతో ఎదిగిన ఆయన పోలీస్ శాఖలో చేరి ప్రజాసేవను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు.

సహచరుల మాటల్లో కిరణ్ ఎంతో మృదుస్వభావి, అందరితో ఆప్యాయంగా మెలిగే వ్యక్తి. ఎంతటి ఒత్తిడిలోనైనా చిరునవ్వుతో విధులు నిర్వర్తించేవారని, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారిని కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయసులోనే జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేసింది. కిరణ్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని పలువురు పోలీస్ అధికారులు, సహచరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more