వి.1 న్యూస్, హైదరాబాద్:
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త అందించింది. బాధితులు తమ నిధులను సులభంగా తిరిగి పొందేందుకు ‘మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM)’ అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు TGCSB డైరెక్టర్, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తెలిపారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) నుంచి రీఫండ్‌కు సంబంధించిన SMS లేదా నోటిఫికేషన్ అందుకున్న బాధితులు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా MRM మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. చట్ట అమలు సంస్థలు, సంబంధిత బ్యాంకులు సంయుక్తంగా ధృవీకరించిన అనంతరం అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రీఫండ్ జమ చేయబడుతుందని పేర్కొన్నారు.

రీఫండ్ కోసం దరఖాస్తు చేసే విధానం:
- సైబర్ క్రైమ్ ఫిర్యాదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
- మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా గుర్తింపును ధృవీకరించాలి.
- అర్హత కలిగిన ఫిర్యాదు, సంబంధిత బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి.
- అవసరమైతే PAN కార్డు వివరాలను అప్లోడ్ చేయాలి.
- రీఫండ్ వివరాలను ఒకసారి పరిశీలించి దరఖాస్తును సమర్పించాలి.
- దరఖాస్తు విజయవంతంగా నమోదైనట్లు నిర్ధారణ సందేశం వచ్చిన తర్వాత, ధృవీకరణ పూర్తయ్యాక డబ్బు నేరుగా బాధితుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ప్రజలకు సూచన:
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా నిధులను తిరిగి పొందే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అధికారులు సూచించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







