-- --

ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరణ.. తక్షణ చర్యలకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఫిర్యాదుదారుల సమస్యలు విని సంబంధిత ఎస్‌ఐలు, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేసిన సీపీ పి. సాయి చైతన్య…

నిజామాబాద్, జూలై 13:
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 39 ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విన్న కమిషనర్, వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు కేసులకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల స్థితిని తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి మధ్యవర్తులు లేదా పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, చట్టబద్ధంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మరింత చేరువవుతూ శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు:
✅ ప్రజావాణిలో 39 ఫిర్యాదుల స్వీకరణ
✅ సంబంధిత ఎస్‌ఐలు, సీఐలకు తక్షణ చర్యల ఆదేశాలు
✅ ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం
✅ ప్రజలకు చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more