షాబాద్ పోక్సో, ఆరు హత్యల Sanj నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య.. పంజర్ల వద్ద మృతదేహం..
హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ పోక్సో కేసు, ఆరు హత్యల కేసుల ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల గ్రామం సమీపంలోని ఓ వెంచర్లో ఆయన మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.
రాజ్‌కుమార్ కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం పంజర్ల గ్రామం వద్ద ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








