బోధన్‌లో FSC షాప్ డీలర్లతో RDO విజయకుమారి సమావేశం…
బోధన్, జూలై 11: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR-2026 విజయవంతంగా నిర్వహించేందుకు బోధన్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) శ్రీమతి ఎం. విజయకుమారి ఆధ్వర్యంలో ఫెయిర్ ప్రైస్ షాప్ (FSC) డీలర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా RDO మాట్లాడుతూ, బోధన్ అర్బన్ పరిధిలోని అర్హులందరూ SIR-2026 ఫారాలను పూర్తిగా నింపి, డిజిటైజేషన్ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులకు (BLOలు) సహకరించేలా FSC డీలర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
FSC డీలర్లు రెవెన్యూ శాఖతో అనుసంధానమై ప్రజలకు సేవలందిస్తున్న కీలక భాగస్వాములని పేర్కొన్న ఆమె, SIR-2026 ప్రక్రియను సకాలంలో, పారదర్శకంగా పూర్తి చేయడంలో వారి సహకారం అత్యంత ముఖ్యమని తెలిపారు.

ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు అందిస్తూ, BLOలకు అన్ని విధాలుగా సహకరించాలని డీలర్లకు సూచించారు. డీలర్లు కూడా SIR-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







