సాలూర మండలంలో రెండు ట్రాలీ ఆటోలు స్వాధీనం – కేసులు నమోదు చేస్తారా..? లేక పెనాల్టీలతోనే వదిలేస్తారా..?
బోధన్, జూలై 10 (ప్రతినిధి):
సాలూర మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వాహనాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, డ్రైవర్లు, యజమానుల వివరాలను సేకరించారు. అనుమతులు, రవాణా పత్రాలు, ఇసుక మూలాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
అయితే గతంలో ఇలాంటి ఘటనల్లో కొన్నిచోట్ల కేవలం జరిమానాలతోనే వాహనాలను విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన కేసులు నమోదు చేయిస్తారా..? లేక నిబంధనల ప్రకారం జరిమానాలు విధించి వాహనాలను విడుదల చేస్తారా..? అనే అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలంటే పట్టివేతలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా కచ్చితంగా అమలు కావాలని ప్రజలు కోరుతున్నారు

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







