-- --

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశం – ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం

నిజామాబాద్, జూలై 11 (ప్రతినిధి):
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో ఓ మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడిన కమిషనర్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించి, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అత్యంత త్వరగా అరెస్టు చేయాలని సూచించారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని, నేరస్థుల కదలికలను సాంకేతికంగా విశ్లేషించి త్వరితగతిన కేసును ఛేదించాలని కమిషనర్ ఆదేశించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ పర్యటనలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్‌ఐ హరిబాబు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more