బోధన్, జూలై 11:
బోధన్ శాసనసభ నియోజకవర్గం (012) పరిధిలో కొనసాగుతున్న ఓటరు జాబితా డిజిటైజేషన్ ప్రక్రియ పురోగతిని ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ పోలింగ్ స్టేషన్లు 94, 95, 96, 99, అనీసా నగర్ పోలింగ్ స్టేషన్లు 89, 90, థర్టీ-కోట్ పోలింగ్ స్టేషన్ 78, రెంజల్ బేస్ పోలింగ్ స్టేషన్లు 69, 80, శర్బతి కాలువ పోలింగ్ స్టేషన్లు 61, 62, అలాగే ఎల్‌బీఎస్ నగర్ పోలింగ్ స్టేషన్లు 64, 65, 66లను సందర్శించి డిజిటైజేషన్ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా సంబంధిత బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌ఓలు) సమావేశమై, కొన్ని ప్రాంతాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ మందగించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించి డిజిటైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు.
తనిఖీల సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇతర శాఖలకు చెందిన సిబ్బంది విధుల్లో లేకపోవడం గమనించిన ఆర్డీవో, ఆ విషయాన్ని సంబంధిత శాఖాధిపతుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో డిజిటైజేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







