బోధన్, జూలై 10 :
బోధన్ డివిజన్ చేనేత సహకార కార్మిక సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. డైరెక్టర్ పదవుల ఎన్నికల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించగా, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపు అనంతరం ప్రకటించిన ఫలితాల్లో లోల శంకర్ అధ్యక్షుడిగా, మొత్కూర్ నారాయణ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
డైరెక్టర్లుగా పత్తి గంగారాం, మొత్కూర్ లక్ష్మణ్, శ్యామ్ సుందర్, మొత్కూర్ సాయిలు, తాటిపాముల విజయ్, మొత్కూర్ కళావతి, లక్ష్మి విజయం సాధించారు.

నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు, సంఘ సభ్యులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధి, సభ్యుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నూతన పాలకవర్గం నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధిస్తుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







