Post Views: 80
సద్భావన ఫోరం నిజామాబాద్ ఆధ్వర్యంలో సమావేశం – మానవత్వమే గొప్ప మతమని పిలుపు….
బోధన్, జూలై 11 (ప్రతినిధి):
ప్రేమ, శాంతి, సోదరభావం అనే విలువలతోనే సమానత్వం, స్వేచ్ఛ, శాంతి నెలకొన్న నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పి.ఆర్.టి.యూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు, ధార్మిక్ మంచ్ జిల్లా కో-కన్వీనర్ కృపాల్ సింగ్ సోడి పేర్కొన్నారు.
శనివారం బోధన్ రోడ్డులోని లిమ్రా గార్డెన్లో సద్భావన ఫోరం నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రేమ సమాజానికి పునాది, శాంతి ప్రగతికి సోపానం, సోదరభావం సమాజానికి బలం” అని అన్నారు. మానవత్వానికి మించిన మతం లేదని, ప్రేమకు మించిన భాష లేదని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆలోచించి, శాంతిని ఆచరించి, సోదరభావంతో జీవించాలని పిలుపునిచ్చారు.
విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా సమాజంలోని ప్రతి వ్యక్తి తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి, పేదలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం, చిన్నారులు, వృద్ధుల పట్ల ఆప్యాయత చూపించడం, హింసకు దూరంగా ఉండి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం నిజమైన మానవత్వానికి నిదర్శనమని తెలిపారు.
మదర్ థెరిసా తన జీవితాన్ని అనాథల సేవకు అంకితం చేసి మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచారని, మహాత్మా గాంధీ ప్రేమ, అహింస, శాంతి మార్గం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలో కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలు పరస్పరం సహకరించుకోవడం నిజమైన సోదరభావానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, బంగారం సాయిలు, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధి మాజిద్, డాక్టర్ సృజిల్ బాబు, రామ్ చందర్ గైక్వాడ్, లతీఫ్, నారాయణరెడ్డి, ప్రభుదాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







