అజమ్ కాలనీలో సీసీఎస్ మెరుపు దాడి.. ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ – ప్రభుత్వ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరిక….
నిజామాబాద్, జూలై 9 (v1news):
పేదల కోసం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందజేసే బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచిన ముఠాపై నిజామాబాద్ కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డి. సాయినాథ్, ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది గురువారం సాయంత్రం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజమ్ కాలనీలో తనిఖీలు చేపట్టారు.
దళారుల ద్వారా పేదలకు పంపిణీ చేసిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఒక ఇంట్లో నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభించగా, దానిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో అక్రమంగా బియ్యం నిల్వ చేసిన రహాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉండగా, అతనిపై కూడా కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసును 5వ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, తరలించడం లేదా విక్రయించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారాన్ని అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







