-- --

పండుగల వేళ శాంతిభద్రతలే లక్ష్యం.. నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అప్రమత్తతే రక్షణకు తొలి అడుగు… క్రమశిక్షణే శాంతిభద్రతలకు బలమైన పునాది.”

పాత నేరస్థులపై నిఘా.. అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

వార్త:

నిజామాబాద్, జూలై 9: రాబోయే పండుగల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహించడంతో పాటు నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవల అందింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

గురువారం పోలీస్ కమిషనరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పెండింగ్ కేసుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఈ సమావేశానికి అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు తదితరులు హాజరయ్యారు.

హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా వంటి కేసులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

పాత నేరస్థులు, రౌడీషీటర్లు, బెయిల్‌పై విడుదలైన వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని, రాత్రి పహారాను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై 24 గంటల తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు.

సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దాడులు కొనసాగిస్తూ అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం, రహదారులకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడం, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సంబంధిత శాఖల సమన్వయంతో సరిచేయాలని సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం, సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు…

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more