వర్ని, జూలై 8 (వార్త):
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో మొత్తం 31 సీసీ కెమెరాలను బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకమని, “ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం” అని పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కదలికలు, నేరాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో కూడా వీటి ఉపయోగం ఎంతో ఉంటుందని వివరించారు.
ప్రతి ఇంటి, వ్యాపార సంస్థ, దుకాణం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామ భద్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి పోలీసు శాఖతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీనగర్ గ్రామంలో 15, జాకోర గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సహకరించిన గ్రామపంచాయతీలను కమిషనర్ అభినందించారు.

అదేవిధంగా గ్రామస్తులకు సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్‌ఐ జి. వంశీకృష్ణ, కోటగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, రుద్రూర్ ఎస్‌ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకోర సర్పంచ్ బి. పెద్ద సాయిలు, మాదాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి ఠాకూర్, రిటైర్డ్ శాస్త్రవేత్త తోట చేతన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కె. సురేష్ బాబు, ఉపసర్పంచ్ దస్తగిరి, బాలవికాస్ ట్రస్ట్ సభ్యులు చంద రాములు, బాలయ్య, సాదిక్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







