Post Views: 132
జూలై 10 బంద్‌ను విజయవంతం చేయాలని బీడీఎస్ఎఫ్ పిలుపు..
“విద్య ఉన్న చోటే అభివృద్ధి… ప్రభుత్వ బడి బలపడితేనే సమాజం బలపడుతుంది.”
బోధన్, జూలై 9 ):
బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం బోధన్ పట్టణంలోని స్థానిక పీఆర్టీయూ (PRTU) భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే మాట్లాడుతూ, జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27 వేల నుంచి 4 వేలకు కుదించే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందించాలని కోరారు.
మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, ఇంటర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు మరియు అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంతో పాటు, విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ నంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రతి పాఠశాలలో విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు, వంటశాల, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి బడి బస్సులు నడపాలని, ఉచిత బస్సు పాస్‌లు అందించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్, మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేసి, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అందించాలని, అలాగే తెలంగాణలో జాతీయ విద్యా విధానం (NEP–2020) అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీఎస్ఎఫ్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి నరేందర్, నాయకులు మధు, అర్జున్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







