“శ్రీ సాయిబాబా సన్నిధిలో పట్టితో మొక్కు తీర్చుకున్న కుటుంబం – భక్తులకు అన్నప్రసాద వితరణ
బోధన్, జూలై 9 (వార్త):
బోధన్ పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కులకర్ణి కుటుంబానికి చెందిన చిన్నారి ప్రణయ్ అన్నప్రాశన సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీ సాయిబాబా స్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టితో కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి ప్రథమేశ్–శ్రీప్రియ దంపతులు దాతలుగా వ్యవహరించి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.


ఈ కార్యక్రమంలో తాత–నాయనమ్మలు కులకర్ణి అశోక్‌రావు, సునీత, బాబాయి కార్తికేయతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







