-- --

బోధన్ డివిజన్ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నేడు శిక్షణ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూలై 9: గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, సమర్థవంతమైన పాలన లక్ష్యంగా బోధన్ డివిజన్ పరిధిలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం ఉదయం 9 గంటలకు బోధన్‌లోని లయన్స్ క్లబ్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

ఈ శిక్షణలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పన, 16వ ఆర్థిక సంఘం నిధుల సమర్థ వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి, VB-G-GRAM పోర్టల్ వినియోగం, వివిధ శాఖల సమన్వయంతో గ్రామాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించనున్నారు.

బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా ఈ శిక్షణలో పాల్గొని ప్రభుత్వ మార్గదర్శకాలు, అభివృద్ధి ప్రణాళికలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కోరారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more