ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడే నిజమైన మహానేత.”
వర్ని, జూలై 8:
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతిని ఆయన అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వైఎస్సార్ అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి తన పాలనలో పేద ప్రజల సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇచ్చిన ప్రజానాయకుడని కొనియాడారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.

అలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించారని, ఆరోగ్యశ్రీ, 104, 108 వంటి ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు వైఎస్సార్ పాలన మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కొమ్మన ముత్యాల కృష్ణ, పంతం బ్రహ్మయ్య, షేక్ బాబూమియా, బాలయ్య, మారుతి, శీను, సత్యనారాయణ, వంక నాగేష్ తదితరులు పాల్గొన్నరు
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







