-- --

ఏకచక్రనగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూలై 7:
బోధన్ పట్టణంలోని ఏకచక్రనగర్‌లో గంగాపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గాటుమల్ సాగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్‌రెడ్డి, సుభాష్, దశరథ్, థానాజీ, సీతారాం, గణేష్, దీపక్, పవన్, బాపూజీతో పాటు మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాజాభజంత్రీల నడుమ మహిళలు ఏకచక్రనగర్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు బోనాలను తలపై ఎత్తుకొని సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా భక్తులు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నారు. భక్తుల జైజైధ్వానాలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more