Post Views: 45
కోటగిరి, జూలై 7: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద దేశ మాజీ ఉప ప్రధాని వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన సేవలను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచిరాం మాదిగ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు కన్నం శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు దినేష్‌తో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







