వర్ని, జూలై 8:
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని కోటయ్య క్యాంప్ గ్రామంలో గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. తాగునీటిని ప్రతి కుటుంబం అవసరానికి తగ్గట్టే వినియోగించి, నీటి వనరులను వృథా చేయకుండా సంరక్షించాలని గ్రామ ప్రజలకు సూచించారు.

అలాగే గ్రామంలోని మురుగు కాలువలు (మోరీలు)లో ప్లాస్టిక్ కవర్లు, చెత్త వేయకుండా పరిశుభ్రతను కాపాడాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామం–ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, వివిధ వార్డుల ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొని గ్రామాభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కొత్త బోరు ఏర్పాటు కావడంతో గ్రామంలో తాగునీటి సమస్యకు కొంత మేర ఉపశమనం లభించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







