-- --

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి – ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి: PDSU భారీ ర్యాలీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్

• ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన.

నిజామాబాద్, జూలై 3:
ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు.

రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మానవహారం చేపట్టి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోయిన అనిల్, జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, కాస్మెటిక్ చార్జీలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (BAS) బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని PDSU నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్, జిల్లా సహాయ కార్యదర్శి సృజన్, నాయకులు మున్నా, రేహాన్, హేమాంజలి, శ్రీశాంత్, మణితేజ, అమర్, కుమార్తో పాటు PDSU నాయకులు, విద్యార్థులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more