-- --

భూ భారతి రీ-సర్వేపై నర్సాపూర్‌లో గ్రామసభ అవగాహన సదస్సు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భూమి హక్కు భద్రంగా ఉంటే… రైతు భవిష్యత్తు బంగారంగా ఉంటుంది.”

బోధన్, జూలై 3: బోధన్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “భూ భారతి – తెలంగాణ భూముల రీ-సర్వే” కార్యక్రమంపై శుక్రవారం గ్రామసభ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సర్వే మరియు భూ రికార్డుల శాఖ నిజామాబాద్ సహాయ సంచాలకులు, బోధన్ తహసీల్దార్, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, దాము, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లం, సర్వే శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ కౌన్సిలర్లు, రైతులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సదస్సులో అధికారులు మాట్లాడుతూ భూ రీ-సర్వే కార్యక్రమం ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గడంతో పాటు రైతులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. భూ రికార్డులను సక్రమంగా నమోదు చేయడం ద్వారా రైతుల హక్కులు మరింత బలపడతాయని తెలిపారు.

అలాగే, రీ-సర్వే ప్రక్రియలో గ్రామ ప్రజలు పూర్తి సహకారం అందించాలని, తమ భూములకు సంబంధించిన పత్రాలను ముందుగానే పరిశీలించి అవసరమైన వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు…

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more