ఉషోదయ విద్యాసంస్థల్లో విద్యార్థినులకు స్ఫూర్తిదాయక సందేశం
“చదువే మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చే నిజమైన మెట్టు.”
బోధన్, జూలై 2:
ఉషోదయ మహిళా జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం మెదక్ టౌన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న పవార్ శిరీషను ఉషోదయ విద్యాసంస్థల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, సాధారణ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన శిరీష జీవితం ప్రతి విద్యార్థినికి ఆదర్శమని అన్నారు.
2016–2018 విద్యా సంవత్సరాల్లో ఉషోదయ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన శిరీష 987 మార్కులతో ఉత్తీర్ణత సాధించి, అనంతరం హైదరాబాద్‌లోని కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 2023లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై మొదటి పోస్టింగ్‌ను నర్సాపూర్ టౌన్‌లో చేపట్టగా, ప్రస్తుతం మెదక్ టౌన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ భరోసా కేంద్రం ఇన్‌చార్జిగా సేవలందిస్తున్నారు.
తాను చదివిన కళాశాలకు తొలిసారిగా విచ్చేసిన శిరీషకు ఉషోదయ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ రమణి శాలువా కప్పి, జ్ఞాపిక, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ శిరీష మాట్లాడుతూ, తాను కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందినదినని తెలిపారు. తన తండ్రి పవార్ శ్రావణ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ నలుగురు కుమార్తెలను చదివించారని చెప్పారు. బోధన్‌లోని ఉషోదయ కళాశాలలో చదివిన రోజుల్లో చైర్మన్ సూర్యప్రకాశ్ అందించిన క్రమశిక్షణ, నాణ్యమైన విద్య తన విజయానికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు.
తన చెల్లెలు వైష్ణవిని కూడా ఇదే కళాశాలలో చేర్పించినట్లు తెలిపారు. ఇక్కడి విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. విద్యార్థినులు లక్ష్యసాధనకు కృషి చేస్తే ఏ ఉన్నత స్థాయినైనా చేరుకోవచ్చని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వార్డెన్లు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







