Post Views: 38
కొప్పెర్గ గ్రామంలో ప్రజలతో సమావేశమైన బోధన్ రూరల్ పోలీసులు
బోధన్, జూన్ 27:
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బోధన్ రూరల్ పోలీసులు శనివారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పెర్గ గ్రామంలో “మన ఊరు–మన భద్రత మన బాధ్యత” పేరుతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో బోధన్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, OTPలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయరాదని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, అలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అదేవిధంగా గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
సమావేశంలో గ్రామస్థులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ హామీ ఇచ్చారు. పోలీసుల ప్రజా భద్రతా కార్యక్రమాన్ని గ్రామస్థులు అభినందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








