బోధన్, జూన్ 27:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని 15వ వార్డులో శనివారం కొనసాగుతున్న ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియను తహసీల్దార్ విట్టల్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారుల పనితీరును పరిశీలిస్తూ, ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా గుమ్మల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ వచ్చే ఎన్యూమరేషన్ సిబ్బందికి ప్రతి ఓటరు పూర్తి సహకారం అందించాలని, అవసరమైన పత్రాలు, వివరాలను సకాలంలో సమర్పించి ఓటరు జాబితా శుద్ధీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విట్టల్, గుమ్మల అశోక్ రెడ్డి కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







