ఎరజ్పల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉదయలక్ష్మి ఔదార్యం – గ్రామస్తుల ఘన సన్మానం
బోధన్ రూరల్, జూన్ 27 ( ప్రతినిధి):
విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శమని ఎరజ్పల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. బోధన్ మండలంలోని ఎరజ్పల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయురాలిగా సేవలందించిన ఉదయలక్ష్మి (ఒమాన్‌రావు సతీమణి) శనివారం పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు బాధ్యతగా రూ.1 లక్షలను విరాళంగా అందజేశారు. ఆమె సేవలను గుర్తుచేసుకుంటూ పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

ఉపాధ్యాయురాలిగా విద్యాబోధనతో పాటు, పదవీ విరమణ రోజునే పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమె శేష జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. “గురుభ్యో నమః” అంటూ భావోద్వేగ వాతావరణంలో ఆమెకు ఘన వీడ్కోలు పలికారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







