June 27, 2026 11:35 pm

V1News Telangana

గుంతల రోడ్డులో వరి నాట్లు… బోధన్‌లో బీజేపీ వినూత్న నిరసన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిధులు మంజూరు అయినా పనులు ఎక్కడ?” అంటూ అధికారులపై విమర్శలు..

బోధన్, జూన్ 27: బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బిల్లాల వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు శనివారం గుంతల రోడ్డులో వరి నాట్లు నాటి వినూత్న నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రహదారి మరమ్మతుల కోసం గతంలో నిధులు మంజూరైనప్పటికీ మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని విమర్శించారు. గుంతలతో నిండిన ఈ రహదారిపై ప్రతిరోజూ వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే రహదారి మరమ్మతు పనులను ప్రారంభించాలని, లేనిపక్షంలో ప్రజలను వెంటబెట్టుకుని మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్, వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, నాయకులు హనుమాన్లు చారి, పవన్, గుంత గంగాధర్, వినోద్, అరవింద్, వేణు, ఫణి తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more