భైంసా, జూన్ 27: భైంసాలోని ఇస్లామియా మోడల్ హై స్కూల్‌లో ఎం.ఏ. లతీఫ్ మహా పాదయాత్ర పూర్తి సందర్భంగా శుక్రవారం ఘనంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా అబ్జర్వర్ ఎం.ఏ. లతీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ తల్లిదండ్రులు, పట్టణం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రమశిక్షణ, కృషి, మంచి నడవడిక ప్రతి విద్యార్థి విజయానికి పునాదులని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని వివరించారు.
కార్యక్రమానికి విచ్చేసిన ఎం.ఏ. లతీఫ్‌కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల యాజమాన్యం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించింది. విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడింది.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయగా, విద్యా సేవల్లో విశిష్ట కృషి చేసిన ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు.
ఈ వివరాలను టీమ్ ఎం.ఏ. లతీఫ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







