బోధన్ జూన్ 26: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ డీ వీ కే అన్న 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికికామ్రేడ్ డీ వీ కే అన్న 4వ వర్ధంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడు డి వి కే అన్న భారత దేశ విప్లవోద్యమ నాయకుడని, కమ్యూనిస్టు సిద్ధాంతకర్త అని ఆయన అన్నారు. ఆచరించిన వాడని అతివాదానికి మితవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజాపంథా మార్గం సరి అయిందని బోధించాడని నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మికుల్ని ఐక్యప్ చేసి సంఘటిత పరిచి అనేక పోరాటాలు చేయించి విజయాలకు కృషి ఎనలేని కృషి కొనియాడారు. కామ్రేడ్ డి వి కన్నా ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో వాటిని నెరవేర్చుటకై పోరాటాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, ఎండి ఇర్షద్, బి.సాయిలు, డి. పోశెట్టి, జి. దేవయ్య, జి. లాలయ్య, గంగారాం, సాయిబాబా, జి. శ్రీను, లక్ష్మణ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.







