నేటి కాలంలో అధికార వ్యవస్థపై ప్రజలకు అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉండటం సహజం. అయితే, అటువంటి పరిస్థితుల్లోనూ తన నిష్ఠ, నిజాయితీ, కర్తవ్యపరమైన సేవలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అరుదైన అధికారిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్ నిలిచారు. ప్రజలు ప్రేమతో “మిస్టర్ పర్ఫెక్ట్” అని పిలుచుకునే ఈ అధికారి సేవలు నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.

బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ నజీర్ గారు న్యాయం, పారదర్శకత, నిబద్ధత అనే విలువలకు ప్రతిరూపంగా నిలిచారు. ప్రస్తుతం సాలూర మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐగా సేవలందిస్తున్న ఆయన, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఒకే విధంగా వ్యవహరించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
సినిమా పాత్రల్లో మాత్రమే కనిపించే ధర్మబద్ధత, నిజాయితీ లక్షణాలు నజీర్ గారి నిజజీవితంలో కనిపించడం విశేషం. ఆయనను “సత్యమూర్తి” వంటి పాత్రలతో పోల్చడం కూడా తక్కువే అని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పని విషయంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఆయన ప్రత్యేకత.
ముఖ్యంగా, సామాన్య ప్రజలు ఎదుర్కొనే భూమి, పట్టా, పాసుబుక్, సర్వే వంటి సమస్యలను శీఘ్రంగా పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. ఎవరు వచ్చినా, వారి స్థాయి చూడకుండా, ఓర్పుతో వినడం, సరైన మార్గదర్శనం ఇవ్వడం ఆయనకు అలవాటు. మృదుస్వభావంతో, అందరికీ అందుబాటులో ఉండే అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఇటువంటి కాలంలో డబ్బు, ప్రభావం ముందు చాలామంది తలవంచే పరిస్థితులు ఉన్నా, నజీర్ గారు మాత్రం తన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రజాసేవలో ముందంజలో నిలుస్తున్నారు. “ఇలాంటి అధికారి మా ప్రాంతంలో ఉండటం మా అదృష్టం” అని స్థానికులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో నిజాయితీతో పనిచేసే అధికారులు ఉన్నారనే నమ్మకాన్ని నజీర్ గారు మరొకసారి బలపరుస్తున్నారు. ఆయన సేవలు యువ అధికారులకు మార్గదర్శకంగా నిలవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







